పిడుగు పడటం మీరు ఎప్పుడైనా లైవ్ లో చూశారా..? అదే పిడుగు ప్రయాణించే కారు పై పడితే పరిస్థితి ఎలా ఉంటుంది. ఇలాంటి ఒక సంఘటన అమెరికా కాన్సాస్‌లోని వేవర్లీ సమీపంలో జరిగింది. ఐదుగురు ఉన్న కుటుంబంతో ప్రయాణిస్తున్న కారు వేగంగా దూసుకు వెళ్తుంది. అయితే, ఒక్కసారిగా మెరుపు తో కూడిన భయంకరమైన శబ్దం. అవును ఆ ప్రయాణిస్తున్న కారు పై పిడుగు పడింది.

కారులో ముగ్గురు చిన్నారుల తో పాటు మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదు. అందరూ సురక్షితంగా ఉన్నారు. కానీ, కారుపై పిడుగు పడే సరికి షాక్ లోకి వెళ్లి పోయారు. 13 సెకండ్స్ తో ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సంఘటన జూన్ 25 న చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆ కారు వెనుక వస్తున్న ఒక వ్యక్తి దీనిని రికార్డు చేసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన తర్వాత పలువురు సోషల్ మీడియా పేజీలలో ఈ వీడియోను షేర్ చేశారు.

 

 

x