సల్మాన్ ఖాన్ నటించిన “రాధే” సినిమా ఏకకాలంలో థియేటర్స్ మరియు డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇదే ఏకకాలంలో థియేటర్స్ మరియు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి బాలీవుడ్ సినిమా. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. అధికారిక వర్గాల ప్రకారం, ఈ సినిమాను జీ ప్లెక్స్‌లో చూడటానికి వీక్షకులు రూ. 249 రూపాయలు చెలించాల్సి వస్తుంది. ఈ చిత్రం మే 13 న తెరపైకి రానుంది.

జీ ప్లెక్స్‌తో, ప్రజలు ఈ సినిమాను జీ 5 లేదా టాటా స్కై, ఎయిర్‌టెల్ డిటిహెచ్ వంటి డిటిహెచ్ ప్లాట్‌ఫామ్‌లలో చూడవచ్చు. రాధే సినిమా విడుదల కోసం బాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది. ఈ ఫార్ములాతో ఈ చిత్రం బాగా ఆడగలిగితే, ఇతర పెద్ద సినిమాలను కూడా థియేటర్స్ మరియు డిజిటల్ ఫార్మాట్లలో ఒకేసారి విడుదల చేసే మార్గాన్ని అనుసరిస్తాయని నిర్మాతలు భావిస్తున్నారు.

ప్రభుదేవా దర్శకత్వం వహించిన రాధే సినిమాలో దిశా పటాని కథానాయికగా నటించింది. రాధే సినిమాలో సల్మాన్ ఖాన్‌ను క్రూరమైన పోలీసుగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్ మరియు రణదీప్ హుడా ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు.

x