ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించబడ్డాయి. అయితే, యువ నటుడు నవీన్ పోలిశెట్టి “ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ” సినిమా తో ఉత్తమ నటుడు కేటగిరీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. 2020 లో ఉత్తమ నటుడిగా ఈ అవార్డు అందుకున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.

మహమ్మారి కరోనా కారణంగా అవార్డు ఫంక్షన్ జరగలేదని మరియు బదులుగా వారు అవార్డులను ఇంటికి పంపించారని నటుడు చెప్పారు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఆ అవార్డును మా వాచ్ మెన్ తీసుకోవడం జరిగింది. ఇదే నా తొలి ఉత్తమ అవార్డు అంటూ నవీన్ పోలిశెట్టి ఎమోషనల్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

x