.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కరోనా జాగ్రత్తలు గురించి చెప్పిన విషయాలు
.దేశంలో కరోనా పరిస్థితి
.వివిధ రాష్టాలలో కరోనా పరిస్థితి
.తెలంగాణ లో కరోనా పరిస్థితి:
1. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కరోనా జాగ్రత్తలు గురించి చెప్పిన విషయాలు:
కరోనా పై రెండో అతిపెద్ద యుద్ధం జరుగుతుందన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈరోజు నుంచి 14వ తేదీ వరకు జరగనున్న టీకా ఉత్సవ్ ను ఆయన ప్రారంభించారు. వాక్సినేషన్ వేయించుకోవడం లో ఇతరులకు సహాయం అందించాలని పిలుపునిచ్చారు. కరోనాను తరిమి కొట్టడానికి వ్యాక్సినేట్, ట్రీట్, సేవ్, చెక్ అనే నాలుగు సూత్రాలు పాటించాలని నరేంద్ర మోడీ సూచించారు. ప్రధాని వైరస్ సోకిన ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్ గా ఏర్పాటు చేయాలన్నారు. అర్హులందరికీ “కోవిడ్ పోర్టల్” లేదంటే “ఆరోగ్య సేతు” యాప్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వ్యాక్సిన్ వేసుకోవాలని అన్నారు.
2. దేశంలో కరోనా పరిస్థితి:
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1,52,879 కేసులు నమోదయ్యాయి. 839 మంది చనిపోయారు. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య ఒక కోటి 33 లక్షలు దాటి పోగా ప్రస్తుతం యాక్టివ్ కేసులు 11 లక్షలకు పైగా ఉన్నాయి. టీకా డ్రైవ్ లో ఇప్పటి వరకు 10 కోట్ల 16 లక్షలకు పైగా దోసులు వేసినట్లు చెబుతున్నారు.
3. వివిధ రాష్టాలలో కరోనా పరిస్థితి:
కరోనా సెకండ్ వేవ్ కొన్ని రాష్ట్రాల్లో కలవరపెడుతుంది. ఆయా రాష్ట్రాల్లో కట్టడికి చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య అదుపులోకి రావడం లేదు. ఢిల్లీ లో ప్రజలు గుంపుగా ఉండటాని ప్రభుత్వం నిషేధించింది. తమిళనాడు, చతిస్గడ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ లో అంశాలను మరింత కఠినంగా మార్చారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కట్టడికి విధించిన ఆంక్షలు విజయవంతంగా అమలు అవుతున్నాయి.
లాక్ డౌన్ వల్ల ముంబై సహా చాలా నగరాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. అయితే పలు ప్రాంతాల్లో ప్రజలు కర్ఫ్యూ ని కూడా లెక్క చేయడం లేదు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఛత్తీస్ఘడ్ నుంచి తమ రాష్ట్రం లోకి రాకుండా సరిహద్దులను మూసి వేసినట్లు ఒరిస్సా ప్రకటించండి. మాస్కులు లేకుండా కనిపించిన వారిపై వేలల్లో ఫైన్స్ వేస్తున్నారు.
4. తెలంగాణ లో కరోనా పరిస్థితి:
తెలంగాణ లో కొత్తగా 3187 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు భారీగా కేసులు పెరుగుతూ పోతున్నాయి. తాజాగా ఏడుగురు వైరస్ తో మృతి చెందారు. జిహెచ్ఎంసి లో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 551 కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 20184 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 27 వేలు దాటగా, ఇప్పటివరకు మూడు లక్షల 5 వేల మంది కోలుకున్నారు. మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1759 కి చేరింది.