ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు సంక్రాంతి సెలవులను పొడిగించింది. మరోపక్క ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కానీ, స్కూళ్లకు మాత్రం సంక్రాంతి సెలవులను పొడిగించలేదు.

దీంతో నేటి నుంచి ఏపీలో విద్యాసంస్థలు తిరిగి యధావిధిగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే అయినా విద్యార్థుల విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత తో పాటు వారి భవిష్యత్తు గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పుకొచ్చారు.

ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తియింది. మరోవైపు 15 నుంచి 18 సంవత్సరాల విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. ప్రస్తుతం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను యధావిధిగా నడపాలని
భావిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ గారు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే స్కూల్స్ ను నడిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.

ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నెల 18 నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం స్కూల్స్ ను మాత్రం అప్పుడే మూసివేసేది లేదంటుంది. భవిష్యత్తులో కేసులు ఇంకా పెరిగితే అప్పుడు స్కూల్స్ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

x