కరోనా దెబ్బకు ఏపీలో సినిమా హాల్స్ మూతపడే స్థితికి వచ్చాయి. తెర పై బొమ్మ వేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సినిమా హాల్స్ తెరవాలంటేనే భయపడిపోతున్నారు థియేటర్ యజమానులు. వచ్చే ఆదాయం ఖర్చులకు కూడా సరిపోవడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు.
కరోనా తెలుగు సినిమా పరిశ్రమ ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. కరోనా సెకండ్ వేవ్ లో కొన్ని రోజులపాటు సినిమా హాల్స్ నడిచాయి. కేసులు పెరుగుతూ ఉండటంతో మళ్లీ మూతపడ్డాయి. సామాజిక దూరం పాటిస్తూ 50 శాతం సీట్లతో సినిమా నడపటం కష్టం అనుకున్నారు అప్పట్లో థియేటర్ యజమానులు.
కానీ, ఇప్పుడు మాత్రం పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. థియేటర్స్ ఓపెన్ చేసిన జనాలు వచ్చేలా కనిపించడం లేదు. మొన్న ఈ మధ్య వైజాగ్ లో ఫ్లోటింగ్ ఎలా ఉందొ చూద్దామని ఒక డిస్ట్రిబ్యూటర్ థియేటర్ ఓపెన్ చేశాడు. కానీ అతనికి చేదు అనుభవం ఎదురైంది. 50 మంది ఉండే హాల్లో కనీసం 5 కూడా కనిపించడం లేదు. దీంతో చేసేదేమీ లేక మళ్లీ మూసేశారు.
ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు కూడా హాల్స్ ఓపెన్ చేయాలా వద్దా అనే ఆలోచనలో పడిపోయారు. పబ్లిక్ లో ప్రస్తుతం సినిమా అంటే ఆసక్తి తగ్గి కరోనా భయం పెరగడమే దీనికి గల కారణం. గతంలో వెండితెరపై బొమ్మ చూడటం అంటే మంచి క్రేజ్ ఉండేది. కానీ, ఇప్పుడు OTT ప్లాట్ ఫామ్స్ దెబ్బకు కరోనా తోడై అందరూ ఇంట్లో నే కూర్చొని హోమ్ థియేటర్ పెట్టుకొని సినిమాలను చూసేస్తున్నారు.
సినిమా హాల్ కు వచ్చే వారి సంఖ్య తగ్గడంతో డిస్ట్రిబ్యూటర్స్ కి థియేటర్స్ ను రన్ చేయడం చాలా కష్టంగా మారింది. ఇప్పట్లో ఎవరు సినిమా హాల్స్ తీసే ఉద్దేశం లో కనిపించడం లేదు. రానున్న రోజుల్లో కొంచం పెద్ద సినిమాలు ఉండటంతో అప్పుడు ఏమన్నా తీసే అవకాశాలు ఉన్నాయి.