సమంత నాగచైతన్య విడిపోయి ఐదు నెలలు దాటినా ఈ ఇద్దరి గురించి ఏదో ఒక టాపిక్ నడుస్తూనే ఉంది. బ్రేకప్ సందర్భంగా పెట్టిన పోస్టును సమంత డిలీట్ చేయడంతో వీళ్లిద్దరు మళ్లీ కలుస్తారా.. అనే సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఇంతకీ సమంత ఆ పోస్టును ఎందుకు డిలీట్ చేసింది?

4 సంవత్సరాల వైవాహిక బంధానికి నాగచైతన్య, సమంత విడాకుల తో స్వస్తి పలికారు. ఈ విషయాన్ని వారు అక్టోబర్ 2న సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయం విని చాలా మంది అభిమానులు షాక్ గురైయ్యారు. నాగచైతన్య, సమంత ఇలా విడిపోతారని అసలు ఎవరు భావించలేదు.

అయితే, అక్టోబర్ 2న సమంత పెట్టిన బ్రేకప్ పోస్టును డిలీట్ చేయడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. దీంతో కొంతమంది అభిమానులు వీరిద్దరూ మళ్ళీ కలుస్తున్నారని భావించారు. అయితే, సమంత ఈ మధ్య కాలంలో నాగచైతన్యతో దిగిన ఫోటోలు అన్నిటిని డిలీట్ చేసింది. పాత జ్ఞాపకాలు అన్నీ మర్చిపోవడానికే సమంత ఈ పోస్ట్ ని కూడా డిలీట్ చేసిందని మరికొందరు భావిస్తున్నారు. మరోపక్క నాగచైతన్య ఇద్దరి మంచి కోసమే విడిపోయామని ప్రస్తుతం ఇద్దరం హ్యాపీగా ఉన్నామని బంగార్రాజు సినిమా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

x