టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు సినిమా యొక్క టికెట్ ధరల సమస్యలపై చర్చించేందుకు ఆంధ్ర సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి విజయవాడ కు వెళ్లారు. అయితే, సినీ పెద్దల్లో ఒకరైన నాగార్జున ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో నాగార్జున ఎందుకు హాజరు కాలేదని పలువురు ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం అమల అక్కినేనికి కరోనా వైరస్ సోకడం వల్ల నాగార్జున మరియు అమల ఇద్దరు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే, చిరంజీవి ఛార్టర్డ్ ఫ్లైట్ ను ప్రస్తుతం చరణ్ మరియు ఉపాసన ముంబైలో ఉపయోగిస్తున్నారు. దీంతో నాగార్జున ఈరోజు విజయవాడకు బయలుదేరిన సినీపెద్దల కు తన వ్యక్తిగత ఛార్టర్డ్ ఫ్లైట్ ను ఇచ్చారు.

ప్రస్తుతం చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి మరియు రాజమౌళి విజయవాడలో అడుగుపెట్టి జగన్ తో భేటీ కొనసాగిస్తున్నారు. కాగా, నటుడు అలీ, పోసాని, ఆర్.నారాయణమూర్తి ఇప్పటికే సమావేశం జరుగుతున్న తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.

x