కింగ్ నాగార్జున గారు లాస్ట్ గా చేసిన సినిమా “వైల్డ్ డాగ్”, ఈ సినిమా ఈ రోజు రాత్రి నెట్‌ఫ్లిక్స్లో విడుదల కానుంది. అసలు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కావాల్సి ఉంది, కానీ మూవీ మేకర్స్ ప్రణాళికలను మార్చి థియేటర్స్ కు తీసుకువచ్చారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఈ సినిమాను మొదట్లో ఓటీటీ లో ఆలస్యంగా రిలీజ్ చేద్దాం అనుకున్నప్పటికీ ఏప్రిల్‌లోనే దీనిని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు.
ఈ సినిమా ఏప్రిల్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పవన్ కళ్యాణ్ యొక్క వకీల్ సాబ్ విడుదలయ్యే వరకు, వైల్డ్ డాగ్ మంచి గానే రన్ అయ్యింది, ఈ సినిమాలో నాగార్జున నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారిగా నటించారు, అతను 2007 లో హైదరాబాద్లో జరిగిన రెండు ఏకకాల బాంబు దాడులను విచారిస్తూ కనిపిస్తాడు.
ఈ సినిమా ఇప్పుడు ఏప్రిల్ 22 ఉదయం 12 గంటలకు నెట్‌ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా చూడవచ్చు.
నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మించారు. తమన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అహిషర్ సోలమన్ ఈ చిత్రంతో దర్శకుడిగా అడుగుపెట్టాడు!