టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన సినిమా వైల్డ్ డాగ్ ఈ రోజు రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉందని రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ఎప్పుడో సంక్రాంతి ఓ టి టి లో రావాల్సిన సినిమా. కానీ ఈ సినిమాని థియేటర్ లోనే రిలీజ్ చేయాలని చిత్ర బృందం అనుకున్నారు. చిత్రం మొత్తానికి థియేటర్ లో రిలీజ్కి సిద్ధమయ్యింది. మొదట ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ తో ఒప్పందం కుదుర్చుకొని ఆ తర్వాత సినిమాని బిగ్ స్క్రీన్ పైకి తీసుకు వచ్చింది.

చిత్ర యూనిట్ కు, ఈ సినిమా రిలీజ్ కు అన్నీ మంచి శకునములే ఎదురైయ్యాయి. థియేటర్ లో రిలీజ్ అవ్వడం ఒకటైతే, ఈ సినిమా పోటీని ఎదురుకోవాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా గోపీచంద్ మూవీ “సిటీమార్” రిలీజ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఈ రోజు సుల్తాన్ సినిమా కూడా థియేటర్లను షేక్ చేస్తోంది. ఇది డబ్బింగ్ సినిమా కావడంతో ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ వైల్డ్ డాగ్ మూవీకె ఇస్తున్నారు. మంచి కథ తో నాగార్జున వెండితెరపైకి వచ్చేశారు. బెస్ట్ అవకాశాలతో వచ్చేసిన ఈ సినిమా రివ్యూ తెలుసుకుందాం.

కథ కథనం:

వైల్డ్ డాగ్ స్టోరీ విషయానికి వస్తే హైదరాబాద్ గోకుల్ చాట్ బాంబు పేలుడు ఉదంతాన్ని ఎన్ ఐ ఎ (NIA) ఎలా డీల్ చేసింది, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఏసిపి (ACP) విజయ్ వర్మ ఈ కేసును ఎలా చేదించారు, వీరికి రా (RAW) ఏజెంట్లు ఎందుకు సహకరించారు, వీరిద్దరూ కలిసి టెర్రరిస్టుల కథ ఎలా ముగించారు అనేదే ఈ స్టోరీ. ఈ సినిమాలో నాగార్జున, విజయ వర్మ పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన సరసన రా ఏజెంట్ గా బాలీవుడ్ బ్యూటీ సయామిఖేర్ కనిపించింది.

ఇది ఒక జోనర్ ప్రేక్షకులు మాత్రమే ఆసక్తిగా ఎదురు చూసే మూవీ. యాక్షన్ సినిమాలను ప్రేమించే వారికి ఇది ఫస్ట్ ఛాయిస్. దర్శకుడు అహిషోర్ సోలమన్ అందరూ చూసే సినిమాగా దీనిని మలిచారు. కథనంలో ఎక్కడ బిగి సడలించకుండా కథను ముందుకు నడిపించారు. సినిమాలో ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. ఈ సినిమా ఫస్టాఫ్ కాస్త స్లో గా అనిపించినా, సెకండాఫ్ నుంచి ఆపరేషన్ వైల్డ్ డాగ్ మొదలవుతుంది.

కథ ముందుకు సాగుతున్న కొద్దీ సినిమాపై ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్ లు లాజిక్ కి అందలేదు. అయినప్పటికీ సినిమాను బాగా చూపించారు. భారత్లో మొదలైన ఈ దాడి మూలాలు నేపాల్ లో ఉన్నట్లు తేల్చిన ఎన్ ఐ ఏ (NIA) అక్కడికి వెళుతుంది. సినిమా ఇంటర్వెల్ బ్యాక్ కూడా అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో పాటలు లేకపోవడం కాస్త మైనస్ అయ్యింది. దానివల్ల సినిమా గ్లామర్ మిస్ అయిన ఫీలింగ్ కొంచెం కనిపిస్తుంది.

నాగార్జున ప్రతి సినిమా లోను పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. కానీ ఈ సినిమాలో పాటలు అసలు ఏమీ లేవు. అయినప్పటికీ తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము దులిపేశాడు. ఇక నాగార్జున నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నూటికి నూరు మార్కులు వేస్తారు ప్రతి ఒక్కరు. విజయ వర్మ గా నాగార్జున యాక్టింగ్ అల్టిమేట్. రా పాత్రలో సయామిఖేర్ కూడా అద్భుతంగా నటించారు.

మిగిలిన వారు తమ పాత్రల మేరకు న్యాయం చేశారు. దర్శకుడు కొత్తవారైనా సినిమా ను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా మొత్తం కేవలం ఇన్వెస్టిగేషన్ పోలీసులు కోవాలో సాగింది. కొంతమందికి నచ్చొచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ యాక్షన్ ఎలిమెంట్స్ చూసే ప్రతి ఒక్కరికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. నాగ్ సినిమాలో లో రొమాన్స్ లేకపోవడాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని వచ్చే రోజుల్లో తెలుస్తుంది.

సినిమా ప్లస్ పాయింట్స్:

కథాకథనం మరియు నాగార్జున యాక్టింగ్ ఈ సినిమాకు ప్లస్ అని చెప్పవచు.రా (RAW) ఏజెంట్ గా సయామిఖేర్ యాక్టింగ్ బాగుంది. మంచి స్టోరీ లైన్ ని దర్శకుడు ఎంపిక చేసుకున్నారు.

సినిమా మైనస్ పాయింట్స్:

బలహీనతలు తీసుకుంటే సినిమా ఫస్టాఫ్ మరియు పాటలు లేకపోవడమే. మొత్తానికి వైల్డ్ డాగ్ ఆపరేషన్ వెండి తెరపై సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

ఈ సినిమాకు LATEST NEWS 24X7 ఇస్తున్న రెట్టింగ్ : 2.5/5
x