అక్కినేని అఖిల్ చాలా కాలం నుంచి ఒక హిట్ కోసం ఎదురుచూస్తూన్న సంగతి తెలిసిందే. అయితే, హీరో పరంగా గ్లామర్ ఉన్న, ఫ్యామిలీ సపోర్ట్ తో పాటు డాన్స్ మరియు ఫైట్స్ వంటి మల్టీ టాలెంట్ ఉన్న హిట్ మాత్రం పడటం లేదు. దీంతో అఖిల్ కు అన్ని ఉన్నా అదృష్టం లేకుండా పోయిందనే వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో అఖిల్ సురేందర్ రెడ్డితో “ఏజెంట్” అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గత చిత్రాలకు భిన్నంగా డిజైన్ చేసినట్లు సినిమా పోస్టర్ బట్టి అర్ధమవుతుంది. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్ర కు సరి కొత్త నటుడిని తీసుకురావడానికి సురేందర్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

అఖిల్ కి ప్రతినాయకుడి పాత్రలో ఉపేంద్ర నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రకు స్క్రిప్ట్ కూడా వినిపించినట్లు ఆయన ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. కరోనా నేపథ్యం లో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ వర్క్ ఇంకా ప్రారంభం కాలేదు. త్వరలో ఉపేంద్ర క్యారెక్టర్ కు సంబంధించి కన్ఫామ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది.

x