పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్‌” సినిమాతో రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ నుంచి మరో సినిమా ఎప్పుడు రానుంది అనే దానిపై ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియం అనే రీమేక్ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో రానా కూడా నటించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా 2022 వ సంవత్సరం సంక్రాంతి కి విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరంలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, కరోనా సెకండ్ వేవ్ మరియు షూటింగుల చుట్టూ ఉన్న గందరగోళం కారణంగా, ఈ రీమేక్‌ను జనవరి 2022వ సంవత్సరం లో విడుదల చేయాలనీ అనుకుంటున్నారు. టాలీవుడ్‌లో సంక్రాంతి ఒక పెద్ద పండుగ కావడంతో, ఈ మల్టీస్టారర్‌ను పండుగ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

మరో వైపు, పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ కంబినేషన్లో “హరి హర వీర మల్లు” అనే సినిమా రానుంది. ఈ సినిమాను కూడా మొదట్లో జనవరి 2022 వ సంవత్సరం లో విడుదల చేయాలనీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం కానుంది.

x