నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న అఖండ సినిమా కోసం ప్రేక్షకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం యొక్క టీజర్ ఇటీవలి రిలీజ్ అయ్యి మంచి స్పందన తెచ్చుకుంది. బాలయ్య యొక్క అఘోరా గెటప్ ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. బాలయ్య యొక్క యాక్టింగ్ మరియు డైలాగ్ డెలివరీ సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా, క్రాక్ దర్శకుడు గోపికంద్ మలినేని ఆధ్వర్యంలో బాలయ్య తర్వాతి సినిమా చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.

సంచలనం ఏమిటంటే గోపిచంద్ చిత్రంలో బాలయ్య సరసన త్రిషను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. మేకర్స్ త్రిషను సంప్రదించారని, ఆ పాత్ర చేయడానికి నటి ఆసక్తిగా ఉందని విన్నాము. తెలుగు సినిమాల్లో త్రిష నటించి చాలా కాలం కావడంతో ఇది తెలుగులో త్రిషకు రీఎంట్రీ చిత్రం కావచ్చు. ఆమె చివరి చిత్రం 2016 లో నాయకి, ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. ఆమె 2015 లో లయన్ సినిమా లో బాలయ్యతో కలిసి నటించింది. ఆ సినిమాలో వారిద్దరి కెమిస్ట్రీ భాగుందని అందుకే మేకర్స్ ఈ సినిమా కోసం త్రిషను తీసుకోవాలని భావిస్తున్నారు.

బాలయ్య మరియు గోపిచంద్ నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ కోసం త్రిషను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించే అవకాశం ఉంది.

x