రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో ఇప్పటివరకు తెలుగులో 5 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. అయితే ఇంతకముందు బుల్లితెరపై అలరించిన ఈ షో ఇకపై ఓటిటి వేదికగా ప్రసారం అయ్యేందుకు రెడీగా ఉంది. బిగ్ బాస్ సీజన్ 6 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సారి బిగ్ బాస్ ఓటిటి కంటెస్టెంట్స్ లిస్ట్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా యాంకర్ రష్మి, యాంకర్ శివ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీళ్లతో పాటు సాఫ్ట్ వేర్ డెవలపర్ ఫ్రేమ్ వైష్ణవి, వరంగల్ వందన, ఢీ 10 విజేత రాజు, టిక్ టాక్ స్టార్ దుర్గారావు ఉండనున్నట్లు సమాచారం.

ప్రతి బిగ్ బాస్ షో లో ఒక సింగర్, ఒక డాన్స్ మాస్టర్, ఒక కమెడియన్ ఇలా అన్ని కేటగిరీలకు చెందిన వారు ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. వీళ్లల్లో సింగర్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు కల్పన, గీతామాధురి, రాహుల్, శ్రీ రామచంద్ర లాంటి వారు ఈ షోలో అలరించారు.

ఈసారి హేమచంద్ర బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందే అతనికి రెండు సార్లు బిగ్ బాస్ షో కి వెళ్లే అవకాశం వచ్చినట్లు సమాచారం. అయితే, ఈసారి హేమచంద్ర కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తుంది. దాంతో అప్ కమింగ్ సీజన్లో హేమచంద్ర రావటం కన్ఫామ్ అనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే దీనికి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాయని సమాచారం. తెలుగులో టాప్ సింగర్ గా ఉన్న హేమచంద్ర రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ మూవీలో దోస్తీ అనే సాంగ్ పాడాడు. ప్రస్తుతం ఆ సాంగ్ ట్రేండింగ్ లో ఉంది. మొత్తం అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరి నెల చివరిలో బిగ్ బాస్ షో మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. మళ్లీ నాగార్జునే ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉంటే ఓటిటి లో బిగ్ బాస్ షో లైవ్ 24 గంటల పాటు ఉండనుంది.

x