ప్రస్తుతం భారతదేశంలో టాప్ హీరోయిన్స్ లో ‘కియారా అద్వానీ’ ఒకరు. బాలీవుడ్లో వరుసగా హిట్లు కొట్టడం ద్వారా ఆమె భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఆమె తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ అనే రెండు సినిమాలు చేసింది.

కియారా అద్వానీ కి టాలీవుడ్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
తెలుగు అభిమానులు టాలీవుడ్ లో తిరిగి రావటం గురించి అడిగినప్పుడు త్వరలో ఒక ఉత్తేజకరమైన ప్రకటనతో వస్తానని ఆమె సమాధానం ఇచ్చారు.

కియారా అభిమానుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, “మీ అందరినీ ప్రేమిస్తున్నాను త్వరలోనే ఒక ఉత్తేజకరమైన ప్రకటనతో మీ ముందుకు వస్తున్నాను” అని ట్వీట్ చేశారు. దీంతో కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ఎన్టీఆర్ 30వ చిత్రానికి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. కియారా అద్వానీ, కొరటాల శివ దర్శకత్వం లో ‘భరత్ అనే నేను’ సినిమాలో హీరోయిన్గా నటించారు. ఇప్పుడు ఈ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికారిక ధ్రువీకరణ కోసం మరికొన్ని రోజులు వేచి ఉండాల్సి ఉంది.

ప్రస్తుతం కియారా అద్వానీ అభిమానులు ఆమె సినీ జీవితం మొదలు పెట్టి ఏడు సంవత్సరాలు పూర్తయినందున సోషల్ మీడియాలో #7yearsofkiaraadvani అనే హ్యాష్ ట్యాగ్ నుట్రెండ్ చేస్తున్నారు. ఆమె ఫగ్లీ అనే చిత్రం తో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఈ సినిమా జూన్ 13 2014 వ సంవత్సరం లో విడుదలైంది.

x