ఎంపీ రఘురామ కృష్ణం రాజు బెయిల్ పిటిషన్పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో ఉన్నారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన ఆర్మీ వైద్యులు ఒక నివేదికను తయారు చేసి తెలంగాణ హైకోర్టు ద్వారా సుప్రీం కోర్టుకు పంపించారు.

రఘురామ కృష్ణం రాజు కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందనేదే ఆసక్తికరంగా మారింది. దేశ ద్రోహం కింద ఏపీ సిఐడి పోలీసులు ఎంపీ రఘురామకృష్ణంరాజు ను అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరిపిన సిబిఐ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీనితో రఘురామ కృష్ణం రాజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై సిఐడి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్ట్, సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపి నివేదిక ఇవ్వాలని తెలిపింది. గుంటూరు జైలు నుండి ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను సికింద్రాబాద్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో ద్వారా రికార్డ్ చేశారు. ఆ వీడియోను సుప్రీం కోర్టుకు సమర్పించారు.

ఎంపీ రఘురామ కృష్ణం రాజు బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎంపీ రఘురామ కృష్ణం రాజు కుట్ర పన్నారని ఈ కౌంటర్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ను సుప్రీం కోర్టు రిమాండ్ కు తరలిస్తుందా లేక బెయిల్ ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

x