విద్యారంగం పై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గత సంవత్సరం పరీక్షలు లేకుండానే ముగిసింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండడంతో ఈసారి కూడా టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అన్నా అనుమానాలు వస్తున్నాయి. ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారం మే 1 నుంచి ఇంటర్ మరియు మే 17 నుంచి పదో తరగతి పరీక్షలకు డేట్స్ ఫిక్స్ చేసింది విద్యాశాఖ.
వచ్చే నెలలో జరగాల్సిన టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ కష్టమేనని తెలుస్తోంది. తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఎగ్జామ్స్ నిర్వహిస్తుందా లేదా అని డౌట్స్ వస్తున్నాయి. ఎప్పటిలాగే పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్న, సర్కారు మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
టెన్త్ అండ్ ఇంటర్ విద్యార్థుల ఎగ్జామ్స్ డేట్స్:
రాష్ట్రంలో మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్, మే 2 నుంచి 20 వరకు ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. ఇక మే 17 నుంచి 26 వరకు టెన్త్ ఎగ్జామ్స్ డేట్స్ ఫిక్స్ చేసింది విద్యాశాఖ. గత సంవత్సరం ఎగ్జామ్స్ లేకుండానే పదోతరగతి స్టూడెంట్స్ కి ఇంటర్నల్ పరీక్షల్లోని మార్కుల ఆధారంగా యూపీ పాయింట్స్ తో పాస్ చేశారు. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్లను మరియు ఫీజు కట్టి ఎగ్జామ్ రాయని వాళ్లను కూడా సప్లమెంటరీ లేకుండా మినిమం మర్క్స్ తో పాస్ చేశారు. ఈసారి పరీక్షలు నిర్వహించకపోతే ఎట్లా పాస్ చేయొచ్చు అనే దానిపై అధికారులు ప్రత్యామ్నాయ విధానాలు ఆలోచిస్తున్నారు.
టెన్త్ అండ్ ఇంటర్ విద్యార్థుల ఇంటర్నల్స్ మరియు ఎగ్జామ్స్ వివరాలు:
ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు ఇంటర్నల్ పరీక్షలు కూడా సరిగ్గా జరగలేదు. అయితే లాస్ట్ ఇయర్ ఏపీలో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా లేకుండానే పాస్ చేశారు. అదే విధానాన్ని రాష్ట్రంలోను అమలు చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్ మినిమం మార్క్స్ తో పాస్ చేయొచ్చని, ఇంటర్ సెకండియర్ వారిని మాత్రం తప్పకుండా ఎగ్జామ్స్ పెట్టాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. జూన్ లో కరోనా కేసులు కొంచెం అయిన తగ్గితే ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ నిర్వహించవచ్చు అని అంటున్నారు.
జూన్ లో విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉన్న, కరోనా వల్ల సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ లో క్లాసులు మొదలుపెట్టారు. ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్, కాలేజీలు ఓపెన్ చేసి ఫిజికల్ క్లాసులు మొదలుపెట్టారు. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్చి 24 నుంచి స్కూల్స్ మరియు కాలేజీలు, హాస్టల్స్ బంద్ చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ లో క్లాసులు కొనసాగుతున్నాయి. ఆన్లైన్ క్లాసులు సరిగ్గా అర్థం కావడం లేదని చాలా మంది స్టూడెంట్స్ చెబుతున్నారు.
ఎగ్జామ్స్ నిర్వహించాలంటున్న పేరెంట్స్, వద్దు అంటున్న స్టూడెంట్స్:
ఇలాంటి టైంలో ఎగ్జామ్స్ రాసిన ఎలాంటి ఫలితం లేదంటున్నారు స్టూడెంట్స్, మరోవైపు ప్రైవేట్ స్కూల్స్ లో విద్యార్థులకు ఫీజులు కట్టడం తో ఎగ్జామ్స్ పెట్టాలని చాలా మంది పేరెంట్స్ కోరుతున్నారు. పరీక్షలు లేకపోతే మెరిట్ స్టూడెంట్స్ కు నష్టమేనని చెబుతున్నారు. రాష్ట్రంలో వారం, పది రోజుల్లో 200 పాజిటివ్ కేసులు నుంచి 2,000 కేసుల వరకు పెరిగింది. మే నెలలో కరోనా కేసులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. దీనికి ఇంటర్ మరియు టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహణ ఎలా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ రాష్టం లో ఇంటర్ కాలేజీలు మరియు స్టూడెంట్స్ వివరాలు:
రాష్ట్రంలో మొత్తం 2464 జూనియర్ కాలేజీలు ఉండగా వాటిలో ఫస్ట్ ఇయర్ లో 4 లక్షల 14 వేల 628 మంది స్టూడెంట్స్ మరియు సెకండ్ ఇయర్ లో 4 లక్షల 54 వేల 648 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. అయితే సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కరోనా ఎఫెక్ట్ తో వాయిదా వేసింది ఇంటర్ బోర్డు. ఎగ్జామ్స్ ను మే 29 నుంచి జూన్ 7 వరకు నిర్వహిస్తారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు ఏప్రిల్schools and clg 1నుంచి జరగాల్సిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మరియు ఈ నెల 3 నుంచి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ ను ఇంటి నుంచే రాసుకున్న ఛాన్స్ ఇచ్చారు.
ఇంటర్ మరియు టెన్త్ ఎగ్జామ్స్ సెంటర్ల వివరాలు:
మే నెలాఖరు కు కేసులు తగ్గితే ప్రతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న, షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఇంటర్, పదో తరగతి బోర్డు లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే ఇంటర్ ఎగ్జామ్స్ కోసం 1,771 ఎగ్జామ్ సెంటర్లు, పదవ తరగతి కోసం 3,900 కు పైగా సెంటర్లను రెడీ చేశారు. ఒక్క రూమ్ కు 10 నుంచి 15 మంది లోపు, బెంచ్ కి ఒకరు చొప్పున జిగ్జాగ్ విధానాల్లో కూర్చోబెట్టాలని నిర్వహించారు. అయితే ఎగ్జామ్స్ నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారు అధికారులు.