బాహుబలి స్టార్ ప్రభాస్ ఇప్పుడు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. మీడియా వర్గాల నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, ప్రభాస్ యొక్క వ్యక్తిగత సహాయకులలో ఒకరికి కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. ప్రభాస్ యొక్క మేకప్ మ్యాన్ కోవిడ్ లక్షణాలు కనిపించడం తో కరోనా పరీక్ష చేయించుకున్నారు, దీనితో అతనికి పాజిటివ్ గా నిద్దరణ అయ్యింది. దీనితో తన మేకప్ మ్యాన్ కు పాజిటివ్ రావడం తో ప్రభాస్ క్వారంటైన్ కు వెళ్ళాడు మరియు ఇటీవల తనను కలిసిన వారిని మరియు ప్రియమైన వారిని కూడా అప్రమతంగా ఉండమని చెప్పాడు. ప్రభాస్ తన మేకప్ మ్యాన్ మరియు అతని కుటుంబానికి కూడా మద్దతు ఇచ్చాడు.

రాధే శ్యామ్ నిర్మాతలు ఈ చిత్రం యొక్క చివరి యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో ప్రభాస్, పూజ హెగ్డే, రెబెల్ స్టార్ కృష్ణరాజు పాల్గొనాల్సి ఉంది. కానీ కోవిడ్ యొక్క సెకండ్ వేవ్ వ్యాప్తి మరియు కోవిడ్ -19 కేసులు భయంకరమైన పెరుగుదల వల్ల సినిమా షెడ్యూల్ను నిలిపివేశారు.

“ప్రభాస్ తన సహాయక నటులను, మరియు సాంకేతిక నిపుణులను ఎవరిని ప్రమాదంలో పడేయడానికి ఇష్టపడరు” అని మనకు తెలుసు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే రాధే శ్యామ్ చిత్రీకరణను తిరిగి ప్రారంభించాలని మేకర్స్ కు చెప్పారు. సాలార్ మరియు ఆదిపురుష్ యొక్క తదుపరి షెడ్యూల్ కూడా దీనివల్ల ప్రభావితం అవుతుంది.

x