సందీప్ కిషన్‌ తో ‘నిను వీడని నీడను నేనే’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన కార్తీక్ రాజు మరొక థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. లేడి ఓరియెంటెడ్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రెజీనా కసండ్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది. మూవీ మేకర్స్ ఈ సినిమాకు ‘నేనా నా?’ టైటిల్ ను ఖరారు చేసారు. తాజాగా చిత్రబృందం ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేసింది.

ఈ సినిమా తమిళ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ చిత్రం యొక్క ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శామ్ సి ఎస్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.

x