ఒక గంట కాదు, రెండు గంటలు కాదు ఏకంగా ఒక మహిళా 16 గంటల పాటు స్నానం చేసింది. అంత సేపు స్నానం చేయడంతో ఆమెకు ఒక వింత వ్యాధి వచ్చింది. టిక్ టాక్ యూజర్ అయినా ఆ మహిళ ఏకంగా 16 గంటలపాటు స్నానం చేయడంతో ఆమె కాళ్లు మరియు చేతుల మీద ఉన్న చర్మం ముడుచుకుపోయింది. తన కాళ్లు, చేతులు మునుపటిలా ఉండాలంటే ఏం చేయాలంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి నెటిజన్ల హెల్ప్ కోరింది.

దీనితో కొంతమంది నెటిజన్లు, 16 గంటలపాటు అసలు ఎలా స్నానం చేశావు, అసలు నీకు ఎలా సాధ్యమైంది, బాత్రూమ్లో ఏమైనా నిద్రపోయావా, అసలు బాత్రూమ్లో అన్ని గంటలు ఎలా గడిపావు అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు ఆమె నుంచి ఎలాంటి సమాధానం లేదు. కొంత మంది నెటిజన్లు కాళ్లు, చేతులు పూర్వస్థితికి రావటానికి తమకు తోచిన చిట్కాలు చెప్పగా, మరి కొంత మంది హాస్పిటల్ కి వెళ్ళమని సూచించారు.

x