సోను సూద్ ఈ క్లిష్టమైన కరోనా సమయంలో ప్రజలకు సాయం చేయ్యడానికి తాను ఉన్నానంటూ ముందుకు వస్తున్నాడు. కరోనా మొదటి దశ నుంచి ఇప్పటివరకు ఏంటో మంది ప్రజలకు ఆయన సాయం చేశాడు. చాలా మంది కార్మికులను లాక్ డౌన్ సమయంలో వాళ్ళ సొంత నివాసాలకు పంపడం కోసం ఆయన బస్సులను, రైళ్లను మరియు విమానాల సైతం ఏర్పాటు చేసి వాళ్ళ సొంత నివాసాలకు పంపించాడు.

కులం, మతం , భాషా వంటి బేధాలు లేకుండా దేశ నలుమూలల నుంచి ప్రజలు ఎవరైనా సాయం కోరితే వెంటనే సోనూసూద్ స్పందించి వారికీ తాను ఉన్నానంటూ సాయం చేశాడు. ప్రస్తుతం కరోనా రెండొవ దశలో బెడ్స్ మరియు ఆక్సిజన్ కొరత వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో, సోనూసూద్ తన వంతు సహకారం అందిస్తున్నారు. ఆయన సినిమాలల్లో చేసేది విలన్ పాత్ర కావచ్చు కానీ ఆయన నిజ జీవితంలో చేసే పనులు మాత్రం రియల్ హీరోని తలపిస్తాయి.

సోను సూద్ ప్రజలకు చేస్తున్న మంచి పనులను దృష్టిలో పెట్టుకొని ఓ జిల్లా కలెక్టర్ సోను సూద్ కు సాయం చేయమంటూ లేక రాశాడు. కలెక్టర్ కు సోనూసూద్‌తో గతంలో ఉన్న పరిచయంతోనే ఆయన ఈ లేక రాసినట్టు తెలుస్తుంది. ఆయన కోరిన సాయం కోసం సోను సూద్ కోట్లు రూపాయలు ఖర్చు చేసేందుకు ఆనందంగా ముందుకు వచ్చాడు.

ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ జనరేటర్ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ భయంకరమైన పరిస్థితిని వివరిస్తూ సోను సూద్ కు జిల్లా కలెక్టర్ చక్రధర్ వివరణాత్మక లేఖ రాశారు. సోను సూద్ వెంటనే స్పందించి, సుమారు 2 కోట్ల రూపాయల వేయంతో 1.5 టన్నుల సామర్ధ్యంతో సోను నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ప్లాంట్‌ ఏర్పాటుకు అంగీకరించాడు. జిల్లాకు మరో రెండు రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్ రానుంది.

x