యంగ్ డైరెక్టర్ సుజిత్ ‘రన్ రాజా రన్’ సినిమా తో హిట్ కొట్టి దాదాపు ప్రభాస్ కోసం ఐదు సంవత్సరాలు వేచి ఉన్నాడు. ఆ తర్వాత ప్రభాస్ తో సాహో లాంటి పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించారు. బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సౌత్ ఆడియన్స్ కి అంతగా నచ్చకపోయినా, నార్త్ లో మాత్రం భారీ కలెక్షన్స్ వచ్చాయి . ఈ సినిమాతో సుజిత్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు.

సాహో తర్వాత సుజిత్ ఏ హీరో తో చేయబోతున్నాడు.. ఎలాంటి సినిమా చేయబోతున్నాడు.. అన్న విషయం చాలా ఆసక్తికరంగా మారింది. అయితే, ఆ మధ్య చిరంజీవి లూసిఫర్ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ ను సుజిత్ తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, అది జరగలేదు. ఆ తర్వాత నితిన్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. కానీ, అలాంటివి ఏమి జరగలేదు.

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం సుజిత్ కన్నడ స్టార్ హీరో సుదీప్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో సుజిత్ స్టార్ హీరో సుదీప్ ను కలిసి స్టోరీ లైన్ వినిపించినట్లు దానికి సుదీప్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కన్నడ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

x