పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం, కరుగోరు మిల్లులో విషాదం చోటు చేసుకుంది. అమ్మిరాజు పాలెం కు చెందిన వికాస్ అనే బాలుడు తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. పుట్టిన రోజు వేడుకలు తర్వాత గోదావరి నదిలో ఈతకు వెళ్ళారు. గోదావరి నది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వికాస్ గల్లంతయ్యాడు. స్నేహితుల సమాచారంతో గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు మరియు వికాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.