ఈ కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది. మనదేశంలో సుమారు 2 లక్షల 40 వేల మంది కరోనాకు బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 33 లక్షల మంది కరోనాకు బలయ్యారు. మన దేశంలో రోజుకి నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి ఏ హాస్పిటల్లో చూసిన కరోనా పేషెంట్స్ మరియు ఆక్సిజన్ కొరత, సరైన మందులు లేకపోవడం ఇలా ఎన్నో సమస్యలు మనదేశానికి చుట్టుముట్టాయి. అయితే ఈ కరోనా మహమ్మారి చాలా మంది సినీ ప్రముఖులను కూడా బలితీసుకుంది.

ఉత్తరాఖండ్కు చెందిన ఆయన కరోనా సోకడంతో కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో చేరారు. సరైన చికిత్స అందకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు.

ఫేస్‌బుక్‌లో రాహుల్ వోహ్రాకు 1.9 మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు మరియు అభిమానులు నటుడి మరణం విని విచారం వ్యక్తం చేశారు. అయితే, మరింత బాధాకరమైన విషయం ఏమిటంటే సోషల్ మీడియాలో రాహుల్ చివరి పోస్ట్. “అయితే నాకు కూడా ఒక మంచి వైద్యం అందితే బతుకుతా” అంటూ ఫేస్బుక్ లో తన పరిస్థితిని వెల్లడించిన కాసేపటికే నటుడు రాహుల్ కన్నుమూశారు. పాపం ఆ మాట చెప్పటానికి అతను ఎంత వేదన అనుభవించారో.

తాను బతికే అవకాశాలు లేవని ఒక నిర్ణయానికి వచ్చేసిన రాహుల్ ఇలా వ్రాశాడు, “మళ్ళీ పుడితే మంచి పనులు చేస్తాను, ఇప్పుడైతే నేను ధైర్యాన్ని కోల్పోయాను, బతుకుతానే ఆశ లేదు” అంటూ అతను పెట్టిన పోస్టులు హృదయాలను కలిచివేస్తుంది. అతని మరణాన్ని మొదట థియేటర్ డైరెక్టర్-నాటక రచయిత అరవింద్ గౌర్ ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు.

డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అందరికీ పరిచయం ఉన్న రాహుల్ కరోనా వైరస్ బారిన పడిన తర్వాత చాలా సమస్యలు అతన్ని చుట్టుముట్టాయి, అతని ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది, జీవితం పై ఆశలు వదిలేసుకున్నాడు. తనకు సరైన వైద్యం అందడం లేదని గుర్తించారు అందుకే ఇంకాస్త మంచి వైద్యం అందితే బతుకుతానని తన ఆశల బయటపెట్టాడు చివరికి తానే ధైర్యాన్ని కోల్పోయాడు. చివరి నిమిషంలో మరో ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకుండాపోయింది.

ఒక వారం క్రితం రాహుల్ తన కోసం ఆక్సిజన్ పడక వెతకడంలో సహాయం కోరాడు. “నేను ఇప్పుడు కోవిడ్ రోగిని మరియు గత నాలుగు రోజులుగా ఆసుపత్రిలో ఉనాన్ను. అయితే, నేను కోలుకోవడం లేదు. నా ఆక్సిజన్ స్థాయి నిరంతరం తగ్గుతున్నందున నాకు ఆక్సిజన్ పడక లభించే ఆసుపత్రి ఉందా? నన్ను చూసుకోవడానికి నా దగ్గర ఎవరూ లేరు. నా కుటుంబం పెద్దగా చేయలేనందున, నేను ఈ పోస్ట్‌ను పూర్తిగా నిస్సహాయతతో వ్రాయవలసి వచ్చింది ”. అంటూ పోస్ట్ చేశాడు.

x