అతని జీవితం ఒక పోరాటం, మైదానం బయట అయినా సరే, లోపల అయినా సరే, అతనికి తెలిసింది ఒకటే, ఓపిక ఉన్నంతవరకు పోరాడటం. అతను ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టాడు. అలాగే 12 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేసాడు. వీటన్నింటికి మించి ఇండియాకి రెండు వరల్డ్ కప్ లు అందించాడు. ఆటే ప్రాణం అనుకున్నాడు. ఆ ఆట కోసమే ప్రాణాలను పణంగా పెట్టాడు. ఒకవైపు కాన్సర్ అతన్ని కలిచివేస్తున్న, దేశం కోసం పోరాడి గెలిచి చూపించాడు. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న టీం ఇండియాస్ అల్ రౌండర్ అయినా యువరాజ్ సింగ్ యొక్క బయోగ్రఫీ మీకోసం…!
Yuvraj Singh Age, Height, Family details, Biography
Yuvraj Singh Age | 39 years (2021) |
Date of birth | 12 December 1981 |
Birth Place | Chandigarh, India |
Nickname | Yuvi |
Height (in feet) | 6.167979 feets |
Height (in meters) | 1.88 m |
Father Name | Yograj Singh |
Mother Name | Shabnam Singh |
Wife Name | Hazel Keech |
Batting | Left-handed |
Bowling | Slow left-arm orthodox spin |
Role | Batting all-rounder |
Yuvraj Singh Childhood
అది 1981 వ సవంత్సరం డిసెంబర్ 12వ తేదీ పంజాబ్ లోని చంఢీగర్ అను ప్రాంతంలో యువి జన్మించాడు. యువి తండ్రి పేరు యోగరాజ్ సింగ్, తల్లి షాబాన్ సింగ్.
యువి తండ్రి అంతర్జాతీయ క్రికెట్ లో ఇండియా తరుపున ఫాస్ట్ బౌలరుగా ప్రాతినిథ్యం వహించారు. అలాగే సినిమాలో కూడా నటించేవారు. చిన్న వయస్సు లోనే యువి తల్లి తండ్రుల మధ్య విభేదాలు రావడంతో వారు విడిపోయారు. దీనితో యువి బాల్యం అంత తల్లి వద్దనే గడిచింది.
యువి కి చిన్న వయస్సు నుంచి టెన్నిస్ అంతే ఇష్టం. తన ఆటను చుసిన పొరుగువారంతా గొప్ప టెన్నిస్ ప్లేయర్ అవుతావు అని పొగిడేవారు. దానితో పాటు స్కేటింగ్ లోను రానిచ్చేవారు. స్కేటింగ్ మీద ఉన్న మక్కువతో అండర్ 14 విభాగంలో నేషనల్ రోలరు స్కేటింగ్ పోటీలో ఎంపిక అయ్యి గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. ఇదే సమయంలో యువి తండ్రి తిరిగి తన కుటుంబంతో కలిసిపోతాడు.
Yuvraj Singh’s entry into Cricket
క్రికెటరుగా జీవితం గడిపిన యోగరాజ్ సింగ్ తన కొడుకుని కూడా క్రికెటరుగా చూడాలి అని అనుకుంటాడు. కాకపోతే యువికి క్రికెట్ అంతే అసలు ఇష్టం లేదు. యువి స్కేటింగ్ లో సంపాదించినా మెడల్స్ ని యువి గారి తండ్రి బయటకు విసిరేసి నువ్వు క్రికెట్ మాత్రమే ఆడాలని వత్తిడి చేసేవాడు. దీనితో యువి క్రికెట్ ఆడక తప్పలేదు.
యువరాజ్ మొదట్లో ఎంతో కష్టంగా, అయిష్టంగా ఆడేవాడు. తండ్రి ఏమో అతడిని బౌలరుని చేద్దాం అని అనుకున్నాడు. కానీ యువి మాత్రం బ్యాట్ పట్టుకొని బౌలరుని బాదేసేవాడు, కొంత కాలానికి చేసేది ఏమిలేక క్రికెట్ పైన మక్కువ పెంచుకొని క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు, బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్లో కూడా రాణిస్తూ మంచి అల్ రౌండ్ర్గా మారాడు యువి.
Under 16
1995వ సవంత్సరంలో యువి పంజాబ్ అండర్ 16 విభాగంలో ఆడటం మొదలు పెట్టాడు, అప్పుడు యువి వయస్సు కేవలం 13 సవంత్సరాలు. యువి ట్యాలెంట్ని త్వరగానే గుర్తించిన పంజాబ్ క్రికెట్ అసోసియేషన్, అతనికి పంజాబ్ అండర్ 19 లోకి చోటు కల్పించింది.
Under 19
1996-97వ సీజన్లో హిమాచల్ ప్రదేశ్ అండర్ 19 జట్టుకు విరుద్ధంగా ఆడి, 137 పరుగులు చేసిన యువి మంచి పేరు సంపాదించుకున్నాడు. 1997 వ సంవత్సరంలో తన ఫస్ట్ క్లాస్ కెరీర్ ని ప్రారంభించిన యువి, తన మొదటి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయ్యాడు.
ఆ తరువాత 1999 వ సంత్సరంలో అండర్ 19 కూచ్ బీహార్ ట్రోఫీ ఫైనల్లో, యువి ఆడిన ఇన్నింగ్స్ తన కెరీర్లోనే బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ మ్యాచులో బీహార్ టీం మొత్తం కలిసి 357 పరుగులు చేస్తే, యువి ఒక్కడే 358 పరుగులు చేసి, జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఈ ఇన్నింగ్స్ తో యువి, ఇండియ అండర్ 19 స్క్వాడ్ లో చోటు దక్కించుకున్నాడు.
1999 వ సంవత్సరంలో శ్రీలంక తో జరిగిన 3 వన్డే సిరీస్ లలో తన సత్తా చూపించి, నేరుగా అండర్ 19 వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయ్యాడు. 2000 సంవత్సరంలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో ఇండియా మహమ్మద్ కైఫ్ కెప్టెన్ గా వ్యవహరించారు. ఈ వరల్డ్ కప్ లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన యువి ఏకంగా “మ్యాన్ అఫ్ ది టోర్నమెంట్” గా నిలిచి, ఇండియా అండర్ 19 వరల్డ్ కప్ గెలవడంలో కీ రోల్ పోషించాడు.
Yuvraj Singh’s entry into International Cricket
అలాగే ఈ అద్భుత ప్రదర్శన కారణంగా, అదే సంవత్సరంలో నేషనల్ టీంలో స్థానం సంపాదించి, ఐసీసీ నాకౌట్ ట్రోఫీలో ప్రీ క్వార్టర్ ఫైనల్లో కెన్యాతో జరిగిన మ్యాచ్ ద్వారా తన అంతర్జాతీయ ఆరంగ్రేటం జరిగింది. ఇదే టోర్నమెంట్లో ఆస్ట్రేలియాతో క్వార్టర్ ఫైనల్లో జరిగిన మ్యాచ్ లో 80 బంతుల్లో 84 పరుగులు చేసి తన మొట్టమొదటి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు.
సరిగ్గా ఇదే సమయం లో టీం ఇండియా, సౌరవ్ గంగూలీ న్యాయకత్వంలో రాటు తేలి, క్రికెట్ ప్రపంచంలో దూసుకుపోతున్నాడు. కానీ ఎక్కడో చ్చిన్న లోటు, 1983 వరల్డ్ కప్ లో ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ తర్వాత ఇండియాకి అలంటి నికార్సైన అల్ రౌండర్ దొరకలేదు.
ఎంతోమంది అద్భుతమైన బ్యాట్స్ మెన్లు ఉన్న, బౌలర్లు ఉన్న, అల్ రౌండర్లు లేని లోటు టీం ఇండియాలో అలాగే ఉంది. ఇదే సమయంలో యువి ఎంట్రీ టీం ఇండియాకు ఒక వరం లాగా ఉంది. ఇటు బ్యాట్ తోనూ, అటు బాల్ తోనూ టీమ్ ఇండియాకు మ్యాచ్ విన్నర్ లా తయారయ్యాడు.
Yuvraj Singh’s Achievements
2003 వ సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్ లో యువరాజ్ అద్భుతంగా రాణించి తన స్థానాన్ని టీంలో సుస్థిరం చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు టీం ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయింది. 2003, ఏప్రిల్ 11వ తేదీన బాంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో యువి తన మొట్టమొదటి ఒన్డే ఇంటర్నేషనల్ సెంచరీ సాధించాడు. అదే ఏడాది అక్టోబర్ నెలలో తన మొట్టమొదటి టెస్టును న్యూజిలాండ్ కు వ్యతిరేకంగా ఆడాడు.
2004 వ సంవత్సరం నుండి ఫుల్ ఫామ్ లోకి వచ్చిన యువి, ఇటు స్వదేశంలోనూ, అటు విదేశాల్లోనూ అద్భుతంగా రాణిచ్చి ఇండియన్ క్రికెట్ టీంలో తనకంటూ ఒక మార్కును ఏర్పాటు చేసుకున్నాడు. అటు వన్డేల్లోనూ, ఇటు టెస్టుల్లోనూ ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేసి టీం ఇండియాకు మర్చిపోలేని విజయాలను అందించాడు.
2007 వ సంవత్సరంలో ఒన్డే వరల్డ్ కప్ లో బాంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో ఓడి గ్రూప్ స్టేజిని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ పరిణామం తర్వాత ధోని కొత్త కెప్టెన్ గా, యువి వైస్ కెప్టెన్ గా, ఎంపిక అయ్యారు. అదే సంవత్సరంలో మొట్టమొదటిగా జరిగిన టీ20 వరల్డ్ కప్లో టీం ఇండియా అద్భుతంగా ఆడి కప్ గెలుచుకుంది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టి సరి కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచులో యువి 12 బంతుల్లో 6 హాఫ్ సెంచరీ చేసాడు. ఇప్పటివరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇదే ఫాస్టెస్ట్ 50.
ఆ తర్వాత 2008వ సంవత్సరంలో ప్రారంభించిన ఐపీల్ లో కింగ్స్ XI పంజాబ్ టీంకి కెప్టెన్ గా ప్రాతినిధ్యం వహించాడు. కాకపోతే ఐపీల్ కెప్టెన్సీ యువీకి అంతగా అచ్చి రాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే 3 ఏళ్లలో తన టీంని ఒక్కసారి కూడా ఫైనల్స్ కి చేర్చలేకపోయాడు యువి.
Yuvraj Singh suffered with Cancer
అది 2011వ సంవత్సరం, 28 ఏళ్ళ పాటు కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్న భారత్ అభిమానులందరికి యువి క్రికెట్ వరల్డ్ కప్ ని అందించాడు. ఇదే సమయంలో అనారోగ్యం బాధపడుతున్న యువి తన దేశం కంటే ఏది గొప్పది కాదని మైదానంలోనే రక్తపు వాంతులు చేసుకుంటు బ్యాటింగ్ చేసి టీం ఇండియాకి వరల్డ్ కప్ అందించాడు.
ఈ టోర్నీలో బ్యాట్ తో 362 పరుగులు, అలాగే బంతితో 15 వికెట్లు పడగొట్టి, యువి మ్యాన్ అఫ్ ది టోర్నమెంట్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఇదే సంవత్సరంలో యువీకి వచ్చిన జబ్బు కాన్సర్ అని రష్యన్ డాక్టర్స్ నిర్ధారించారు. ఆ తర్వాత యువి చికిత్స కోసం అమెరికాకి వెళ్లి, 6 నెలల పాటు హాస్పిటల్ లోనే ఉండిపోయాడు.
క్రికెట్ మీద ఉన్న ప్రేమతో భయంకరమైన కాన్సర్ వ్యాధితో పోరాడి గెలిచినా యువి తిరిగి మైదానంలో అడుగుపెడటానికి ఎంతో సమయం పట్టలేదు.
Yuvraj singh become highest bid player in IPL Auction
2012 వ సంవత్సరంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ జట్టులో తిరిగి యువరాజ్ సింగ్ చోటు సంపాదించుకున్నాడు. కానీ కాన్సర్ వ్యాధి యువరాజ్ ఫిట్నెస్ ని బాగా దెబ్బతీసింది. దీని కారణంగానే 2013 వ సంవత్సరం నుండి తన ఫామ్ ని కోల్పోయి జట్టులోకి తరచుగా వాస్తు వెళ్తూ ఉండేవాడు. ఆ తర్వాత 2014 మరియు 2015 వ సంవత్సరంలో జరిగిన ఐపీల్ ఆక్షన్ లో అత్యధిక ధర పలికిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.
2014 లో 14 కోట్లు గరిష్ట ధర పలికిన యువి, 2015వ సంవత్సరంలో ఏకంగా 16 కోట్ల ధర పలికి తన రికార్డుని తానే బ్రేక్ చేసాడు. కాకపోతే ఈ రెండు సీజన్లో యువి చెప్పుకోదగ్గ ఆట తీరు కనబరచలేదు. 2015 వ సంవత్సరంలో జాతీయ జట్టులో కూడా స్థానం కోల్పోయిన యువి, విజయ హజారే ట్రోఫీలో అద్భుతంగా రాణిచ్చి, తిరిగి 2016వ సంవత్సరంలో ఇండియన్ టీంలో స్థానం దక్కించుకున్నాడు. అదే ఏడాది నవంబర్ 30వ తేదీన హాజెల్ కీచ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఫిట్ నెస్ కోల్పోయి ఫామ్ అందుకోలేక 2017వ సంవత్సరంలోనే రిటైర్మెంట్ ప్రకటిద్ధామనుకున్నాడు.
కాకపోతే యువి తన పేరెంట్స్ మరియు భార్య మాటలకు విలువ ఇచ్చి మరో రెండు ఏళ్ళ పాటు క్రికెట్ ఆడాడు. చివరికి 2019 వ సంవత్సరం జూన్ 10వ తేదీన ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. దాదాపు 20 ఏళ్ళ పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన యువి 40 టెస్టుల్లో 1900 పరుగులతో పాటు, 9 వికెట్లు తీసాడు. అలాగే 304 వన్డేలు ఆడిన యువి 8701 పరుగులు చేసి, 111 వికెట్లు పడగొట్టాడు. 58 టీ20 ఇంటెర్నేషనల్లో 1177 పరుగులు చేసి, 28 వికెట్లు కూడా పడగొట్టాడు.
Yuvraj Singh’s Awards
ఇండియన్ గవర్నమెంట్ 2012 వ సంవత్సరంలో తన వరల్డ్ కప్ ప్రదర్శనకుగాను, యువీకి అర్జున్ అవార్డు బహుకరించింది. అలాగే 2014వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుని కూడా బహుకరించింది.
యువి రిటైర్మెంట్ స్పీచ్ లో భాగంగా మాట్లాడుతూ తన బీసీసీఐ పర్మిషనుతో ఇండియాకి బయట ఆడతానని వెల్లడించాడు, తన శేష జీవితం కాన్సర్ భాధితులకు సేవ చేసుకుంటానని చెప్పి తన మానవత్వాన్ని చాటుకున్నాడు.
Image source: