కరోనా ఒకవైపు దండయాత్ర చేస్తుంటే మరోవైపు ‘జికా వైరస్’ కేసులు పెరగటం కలకలం రేపుతుంది. కేరళలో తొలిసారిగా జికా వైరస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో అప్రమత్తమైన కేరళ సర్కార్ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఒక వైపు కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుతుంటే మరో వైపు జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా కేరళలో జికా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుంది.
తిరువనంతపురం జిల్లాలో 13 జికా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. పూణేలోనే నేషనల్ వైరాలజీ ల్యాబ్ కు 19 శాంపిల్స్ పంపగా 13 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 24 ఏళ్ల గర్భిణీలో తొలిసారిగా ఈ వైరస్ వెలుగు చూసింది. ఈ నెల 7 న ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ లో వైరస్ లక్షణాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తిరువనంతపురం కు చెందిన మరో మహిళ జూన్ 28న జికా వైరస్ లక్షణాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందింది.
వారం రోజుల తర్వాత అవే లక్షణాలతో ఆమె తల్లి కూడా హాస్పటల్లో అడ్మిట్ అయింది. దదుర్లు, జాయింట్ పెయిన్స్, జ్వరం లక్షణాలతో జికా వైరస్ డెంగ్యూ లక్షణాలను పోలి ఉంది. జికా వైరస్ ‘ఏడెస్’ అనే దోమ నుంచి మనుషులకు సోకుతుంది. ఈ వైరస్ ప్రాణాంతకం కాకున్నా ఇప్పటి వరకు దీనికి ముందు లేక పోవటం ఆందోళన కలిగించే విషయం.
ఈ వైరస్ సోకితే కొందరిలో జ్వరం, దదుర్లు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు సోకితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ ను మొదట 1947 లో ఉగాండ అడవుల్లోని కోతిల్లో గుర్తించారు. ఆ తరువాత 1952లో మనుషులోను ఈ వైరస్ ను గుర్తించారు. 2017లో తమిళనాడులో ఈ కేసులు వెలుగు చూశాయి.